కాటమరాయుడు ఆడియో వేడుక ఎక్కడో తెలుసా..!

100
Katamarayudu Audio Venue Confirmed..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాన్ కాటమరాయుడు మూవీ షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ తరువాత.. పవన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమిళ చిత్రం వీరమ్ కు ఇది రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన కాటమరాయుడు పోస్టర్లు టాలీవుడ్ లో హీటు పెంచేశాయి. వచ్చే ఉగాదికి పవర్ స్టార్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ నేపధ్యంలో త్వరలోనే మూవీ ఆడియో వేడుక నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు కూడా సాగుతున్నాయి. అయితే ఈ ఆడియో వేడుక ఎక్కడ నిర్వహిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.సినిమా కథ రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుంది కాబట్టి, ఆడియో రిలీజ్ కూడా అక్కడే చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట నిర్మాతలు.

తిరుప‌తిలో అయినా..లేదంటే..అనంత‌పురంలోనైనా ఆడియో రిలీజ్ కు ఏర్పాట్లు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది‌. ఎట్టిపరిస్థితుల్లో ఫిబ్రవరి నెల ఆఖరులో ఆడియో వేడుక‌ను నిర్వ‌హించాల‌ని చిత్రయూనిట్ భావిస్తోంది. పవన్ ఫ్యాన్స్ ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా గ్రాండ్ గా వేడుక నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే ఆడియో రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ రానున్నట్లు సమాచారం.