- Advertisement -
ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిని శనివారం సందర్శించారు. క్షేత్రానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీకాంత్ ఆలయంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. దైవ దర్శనం ఎంతో మానసిక ప్రశాంతతను ఇచ్చిందని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు.
Also Read:భారీ వర్షాలు..ఢిల్లీకి ఎల్లో అలెర్ట్!
- Advertisement -

