కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే!

1
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్‌చాట్‌లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల తాను నిర్వహించిన ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేవలం మంత్రి కొండా సురేఖ మరియు చిన్నా రెడ్డికి సంబంధించిన అంశాలపై మాత్రమే అధిష్ఠానంతో చర్చించినట్లు వెల్లడించారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని, తుది నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికే వదిలేశారని పేర్కొన్నారు.

అలాగే తనకు మంత్రి పదవి రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ… ఆ వార్తలపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Also Read:హైదరాబాద్‌లో ‘కాకా’!

- Advertisement -