సామ్‌ గురించి కాదు..కుక్కల గురించి: సిద్ధార్థ్

22
siddharth

సమంత, నాగ చైతన్య విడాకుల గురించి తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. సమంత తీరును తప్పుబడుతూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తుండగా సామ్ అంతే ఎమోషనల్‌గా ట్వీట్ చేసి రిప్లై ఇస్తున్నారు. సమంత విడాకులు సమయంలోనే హీరో సిద్ధార్థ్..పాఠశాలలో టీచర్ నుండి నేను నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి … మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మీరేమంటారు ?” అని నెటిజన్లను ప్రశ్నించాడు.

దీంతో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సామ్ గురించేనని ఆ పోస్ట్ వైరల్‌ కావడంతో స్పందించారు సిద్ధార్థ్‌. తన జీవితంలో జరిగిందే తాను ఆరోజు ట్వీట్ చేశానని, ఎవరో తన గురించి అనుకుంటే తానేమీ చేయలేనని చెప్పుకొచ్చారు. మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే, నేను దాన్ని ట్వీట్ చేశాను. దానికి ఎవరో బాధపడితే నాకేం సంబంధం ? అంటూ క్లారిటీ ఇచ్చేశారు.