కరోనా మరణాలు..రెండోస్ధానంలో బ్రెజిల్

151
brazil
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 7,32,476 మంది మృతిచెందగా ఒక్క లాటిన్‌ అమెరికాలో కరోనా మహమ్మారి ధాటికి 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

లాటిన్ అమెరికాలో ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఎక్కువగా బ్రెజిల్‌లో 6 లక్షల మంది మరణించారు. కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉన్నది. ఇక మెక్సికో, పెరూ, కొలంబియా, అర్జెంటీనా దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి.

ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల 79 లక్షల 69 వేల 872 మంది కరోనాబారిన పడగా భారత్‌ రెండో స్థానంలో ఉన్నది. బ్రెజిల్‌, బ్రిటన్‌, రష్యా, టర్కీ, ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

- Advertisement -