గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మేడ్చల్ కలెక్టర్..

116
Medchal Collector

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పివి పద్మజ డిసిపి బాలానగర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నారపల్లి భాగ్యనగర్ నందనవనం పార్క్‌లో మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎం.పి సంతోష్ కుమార్‌ను అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడమే కాదు నాటిన మొక్కలు మూడు సంవత్సరాలు కాపాడే బాధ్యత ఈ కార్యక్రమంలో ముఖ్యం అన్నారు. హరితహారంకి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశంలో మొదటి స్థానం తీసుకెళ్లే విధంగా, ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తుందని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని, హరితహారంలో భాగంగా 2000 మొక్కలు వ్యతిగత శ్రద్ధతో సహచరుల సహకారంతో మొక్కలు నాటారని తెలిపారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఉసిరి మొక్క నాటి దానిని తన వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి జాయింట్ కలెక్టర్ పశ్చిమ గోదావరి, వేణుగోపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం, మాధవిలత రెడ్డి జాయింట్ కలెక్టర్ కృష్ణ జిల్లా లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.