ఓటీటీలో నితిన్ చెక్..!

69
check

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై హీరో నితిన్ నటించిన చిత్రం చెక్. వి. ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన…రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ ముందు అంతగా వసూళ్లను రాబట్టలేకపోయినా తన నటనతో మెప్పించారు నితిన్.

తాజాగా నితిన్ న‌టించిన చెక్ చిత్రం కూడా ఓటీటీలో విడుద‌లకు సిద్దంగా ఉంది. మే 14 నుండి స‌న్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చగా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయి సెంట్ర‌ల్ జైలుకి వెళ్లిన నితిన్‌ ఏ విధంగా బయటపడ్డాడనే సినిమా కథ. లాయర్‌గా ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్.