కరోనా బాధితులకు అండగా రేణు దేశాయ్..!

71
renu

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. హాస్పిటల్‌లో బెడ్స్‌ దొరక్క పోవడం, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలు ఎన్జీవోలు ముందుకొస్తుండగా తాజాగా నటి రేణూ దేశాయ్‌ తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో మాట్లాడిన రేణు… ప్లాస్మా లేదా ఆక్సిజన్‌ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌ లో మెసేజ్‌ చేస్తే, వారికి సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్‌ ద్వారా తనని సంప్రదించాలన్నారు.