కర్ణాటకలో రెండు రోజుల ఉత్కంఠ తర్వాత నేడు బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జేడీఎస్ కు 38 సీట్లు వచ్చాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తమకు పూర్తి మెజార్టీ ఉందని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు గవర్నర్ ని కలిసినా. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతో కన్నడ రాజకీయాలపై, నేతలపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు స్పందించారు. కర్ణాటక ఎన్నికల తీర్పు తాను నటిస్తున్న ‘ఓటరు సినిమాలాగే ఉందని అన్నారు.
వాట్ ఏ ట్విస్ట్ సర్ జీ. కర్ణాటక తీర్పు ఇంచుమించు నేను నటిస్తున్న ఓటర్ సినిమాలాగే ఉందంటూ విష్ణు ట్వీట్ చేశాడు. జీఎస్. కార్తిక్ దర్శకత్వంలో ఓటర్ సినిమాలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్నాడు. గత ఏడాది నంబర్ లో ఆయన బర్తే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ గత డిసెంబర్ లోనే విడుదల కావాలి… కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
ఈ చిత్రాన్ని ‘కురల్ 388’ పేరుతో తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. ఇందులో విష్ణు సరసన సురభి నటిస్తుండగా, పోసాని మురళీకృష్ణ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇక మంచు విష్ణు చేసిన ఈ ట్వీట్ తో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో అని సినీ జనాలు అనుకుంటున్నారట.
What a twist sirji! #Karnatakverdict . This is almost like #Voter movie!
— Vishnu Manchu (@iVishnuManchu) May 17, 2018