బిగ్ బాస్‌ హౌజ్‌లో నోయల్-లాస్య రచ్చ..

125
lasya

బిగ్ బాస్‌ 4 తెలుగు షో సూపర్‌గా సాగిపోతు నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. అయితే ప్రతివారం నామినేషన్స్ పెట్టి ఇంటి సభ్యులు కొట్టుకుతిట్టుకునేట్టు చేస్తారు బిగ్ బాస్. ప్రతివారం మాదిరే ఈవారం కూడా నామినేషన్స్ ప్రాసెస్ ఉండటంతో హౌస్‌లో ఒకరి మీద ఒకరు అరుచురకుంటు హౌజ్ టాప్ లేపుతున్నారు. మరోవైపు మేమే తోపు కంటెస్టెంట్లుగా చలామణి అవుతున్న నోయల్-లాస్యలు తిట్లదండకం అందుకున్నారు. వీరి మధ్య కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నాట్టుగా పెద్ద పెద్ద అరుచుకుంటూ.. నేనంటే నేను అన్నట్లు ఒకరిపై ఒకరు ఫైర్‌ అయ్యారు.దీనికి సంబంధించిన సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు బిగ్‌ బాస్‌.

ఈ ప్రోమోలో నోయల్ లాస్యలు వాడీవేడిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఈ ప్రోమో విషయానికి వస్తే.. వాళ్ల దగ్గర నా గురించి ఏదో అన్నావంట అంటూ నోయల్ నిలదీయడంతో ఫైర్ అయ్యింది లాస్య. ఫస్ట్ అడిగి చూడు.. ఎవరు చెప్పారో.. నేను చెప్పలేదు అంటూ గట్టిగా అరిచింది లాస్య. ఇక నోయల్‌ ఎందుకు అరుస్తున్నావ్ నాకు అరవడం రాదనుకుంటున్నావా?? అంటూ రెచ్చిపోయాడు.

నీకే కాదు నాకూ అరవడం వచ్చు.. నీ వెనకాల మాట్లాడే అవసరం నాకు లేదు అని లాస్య చెలరేగిపోవడంతో.. అయితే ముందు మాట్లాడు వాడ్ని పిలుస్తా అంటూ నోయల్ రచ్చ రేపాడు. ఏయ్ పిలువు.. ముందుకు తీస్కురా మాట్లాడదాం అంటూ వెనక్కి తగ్గనే తగ్గడం లేదు లాస్య.. మొత్తానికి ఈ ప్రోమో అయితే హీట్ మీదే ఉంది.. కాని ఇదేదో ప్రోమో కోసమే కట్ చేసినట్టుగా ఉంది. టాస్క్‌లో భాగంగా సీరియస్ అవుతుంటే దాన్ని ప్రోమో కోసం వాడేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం మొత్తం తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.