గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గోన్న హీరో కార్తీకేయ

289
hero karthikeya
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. చాలా మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గోని మొక్క‌లు నాటుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా హీరో విశ్వ‌క్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీక‌రించారు హీరో కార్తికేయ‌. ఈ రోజు త‌న నివాసంలో మూడు మొక్క‌లు నాటారు హీరో కార్తికేయ‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రపంచంలో వాతావరణం మనల్ని ప్రశ్నిస్తుంది అని పర్యావరణం రక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు. ఈ చాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసిన చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -