- Advertisement -
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ…..జన్మదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. హిందీలో ఛత్రపతి చేస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం అందరికి బాగుండాలని కోరుకున్నానన్నారు.
- Advertisement -