సంక్రాంతి బరిలో రావణాసుర!

26
raviteja

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా రవితేజ 70వ సినిమాకు రావణాసుర అనే టైటిల్‌ ఖరారు చేయగా తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ‘రావణాసుర’ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని సినిమా టీమ్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌ వేదికగా ఉదయం 9:50 గంటలకు ముహుర్తం షాట్ ని తీయనున్నారు. ఆ తర్వాత సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమాని అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు.

త్వరలో రవితేజ నెక్స్ట్ సినిమా ‘ఖిలాడీ’ కూడా విడుదలకి రెడీగా ఉంది. ఆ తర్వాత ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.