హీరో బాలకృష్ణకు గాయాలు..

18

షూటింగ్ స్పాట్‌లో నందమూరి నట సింహం బాలకృష్ణకు గాయాలు అయినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమో ఈ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేశారు. ఈ ప్రోమోను క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ షో ప్రోమో చేస్తుండగా… బాలకృష్ణకు కాలికి తీవ్రంగా గాయమైంది. అయినా సరే.. ప్రోమో షూట్ కోసం బాలయ్య అలాగే షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. షూటింగ్ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ షోకు ‘అన్‌స్టాపబుల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చిత్రం చేస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయడంతో త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అడిగా అడిగా అంటూ విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.