‘పెళ్లిసందD’.. రంగంలోకి చిరు-వెంకీ..

18

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ హీరోగా ‘పెళ్లిసందD’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడ. గౌరి రోనంకి దర్శకురాలిగా ఆర్కా మీడియా బ్యానర్ మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, మాధవి కోవెలమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘పెళ్లిసందD’లో శ్రీలీలను హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రాఘవేంద్రరావు ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అక్టోబరు 15న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ మూవీ.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 10న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ వస్తున్నారు. ‘పెళ్లిసందD’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. ఈ నెల 10న (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.