బాల‌కృష్ణ‌తో హ్యాట్రిక్ కొట్ట‌నున్న బోయ‌పాటి…

292
hero balakrishna hatric hit with tring to director boyapati srinu..muhurtham on june 10..
- Advertisement -

నంద‌మూరి హిరో బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్వ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. బాల‌కృష్ణతో హ్య‌ట్రిక్ కొట్టేందుకు సిద్దంగా ఉన్నాడు బోయ‌పాటి. టాలీవుడ్ లో మాస్ డైరెక్ట‌ర్ గా బోయ‌పాటికి మంచి పేరుంది. తీసిన ప్ర‌తి సినిమా అంచ‌నాల‌ను మించుతుండ‌టంతో బోయ‌పాటికి అవ‌కాశాలు కూడా ఎక్కువే వ‌స్తున్నాయి. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మూడో సినిమాకు ముహుర్తం డేట్ కూడా ఫిక్స్ అయ్యింద‌ని తెలుస్తుంది. హీరో బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో వ‌చ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే.

hero balakrishna hatric hit with tring to director boyapati srinu..muhurtham on june 10..

సింహ‌, లెజెండ్ వంటి బంప‌ర్ హిట్ ల‌ను అందించాడు బోయ‌పాటి. బాల‌కృష్ణ 100వ సినిమాకు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు అనుకున్నారు..కానీ బోయ‌పాటి బిజిగా ఉండ‌టంతో అది వేరే వారికి వెళ్లిపోయింది. ఈసినిమాను త్వ‌ర‌లోనే ముహుర్తం కూడా చేయ‌నున్నార‌నే వార్త‌ ఫిలిం న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఓప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ నిర్మించే ఈసినిమాను జూన్ 10వ‌తేదిన లాంచ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. జూన్ 10 బాల‌కృష్ణ బ‌ర్త్ డే కావ‌డంతో బాల‌కృష్ణ బ‌ర్త్ డే కానుక‌గా బోయ‌పాటి ఆరోజున సినిమా ముహ‌ర్తాన్ని ప్లాన్ చేశాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌నుల‌లో బిజిగా ఉన్నాడు. డైరెక్ట‌ర్ లేక‌పోవ‌డంతో సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది.

hero balakrishna hatric hit with tring to director boyapati srinu..muhurtham on june 10..

ఎన్టీఆర్ బ‌యోపిక్ సెట్స్ మీద‌కి వెళ్ల‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌టంతో అంత‌లోపు వినాయ‌క్ తో సినిమా మొద‌లుపెట్ట‌నున్నాడు బాల‌కృష్ణ‌. ఇక బోయ‌పాటి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ మూవీలో బిజిగా ఉన్నాడు. ఈసినిమా ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కూ షూటింగ్ పూర్తి చేసుకున్నాడ‌ని స‌మాచారం. సెప్టెంబ‌ర్ లోపు రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని..ద‌స‌రా త‌ర్వాత బాల‌కృష్ణ సినిమా షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్నాడు బోయ‌పాటి. 2019 ఎన్నిక‌ల ముందే ఈసినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ వేశాడ‌ట బోయ‌పాటి. రాజ‌కీయ నేప‌థ్యంలో ఉండే ఈస్టోరీ ఉండ‌నుంద‌ని స‌మాచారం. ముచ్చట‌గా మూడోసారి విర‌ద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

- Advertisement -