అతిథి దేవోభ‌వ…. ఫ‌స్ట్‌లుక్

175
aadhi sai kumar
- Advertisement -

ఆదిసాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాత‌లుగా పొలిమేర నాగేశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అతిథి దేవోభ‌వ‌.ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ విడుద‌ల‌చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ప్ర‌ముఖ‌నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా…ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ఈ సినిమా డిఓపి అమ‌ర్‌నాథ్ రెడ్డి నేను క‌లిసి కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాం. ఆయ‌న ద్వారా నేను ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం జ‌రిగింది. ఫ‌స్ట్ లుక్ చాలా బాగుంది. ఆదిలో ఎప్ప‌డు ఒక స్పార్క్ ఉంటుంది. అలాగే అమ‌ర్ ఈ సినిమాలో ఒక పాట చూపించాడు. చాలా చాలా బాగుంది. శేఖ‌ర్ చంద్ర‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టైటిల్ చాలా బాగుంది. త‌ప్ప‌కుండా చాలా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత‌లు రాజాబాబు, అశోక్ రెడ్డి గారికి, అలాగే ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ గారికి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమాకు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రికీ మై బెస్ట్ విషెస్‌. ఆది కెరీర్‌కి మ‌రోసారి మంచి కిక్ స్టార్ట్ చేసే సినిమా అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

లిరిసిస్ట్ భాస్క‌ర భట్ల మాట్లాడుతూ – ఈ సినిమాలో రెండు మంచి పాట‌లు రాశాను. మంచి టీమ్‌. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ నాకు మంచి స్నేహితుడు. వెరీ టాలెంటెడ్. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అన్నారు.చిత్ర ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వ‌ర్ మాట్లాడుతూ – నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు రాజాబాబు, అశోక్ రెడ్డి గారికి నా జీవితాంతం రుణ‌ప‌డిఉంటాను. మంచి క‌థ ఇచ్చిన వేణుగారికి, అలాగే అద్భ‌త‌మైన మ్యూజిక్ ఇచ్చిన శేఖ‌ర్ చంద్ర గారికి థ్యాంక్యు. పాట‌లు, ఫోటోగ్ర‌ఫి నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. ఆదిగారు ఈ సినిమాలో ఒక డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపిస్తారు. హీరోయిన్ నివేక్ష మంచి పెర్ఫార్మ‌ర్‌. మంచి క్యాస్టింగ్ ఉంది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంది అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ జ‌న‌రేష‌న్‌లో కూడా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని చ‌క్క‌గా చూపించే ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు ఆయ‌న‌కు నా ధ‌న్య‌వాదాలు. భాస్క‌ర‌భ‌ట్ల ఎన్నో మంచి పాట‌లు రాశారు. ఈ సినిమాలో కూడా ఒక మంచి పాట రాశారు. నేను విన్నాను చాలా బాగుంది. సాధార‌ణంగా సినిమా అంటే ప్యాష‌న్ అని చెబుతుంటారు. మా ఫ్యామిలీమెంబ‌ర్స్ అంద‌రూ ఇన్‌వాల్వ్ అయ్యి వాళ్ల‌నుకున్న ప‌ర్‌ఫెక్ష‌న్ వ‌చ్చే విధంగా చూసుకుంటారు. కాబ‌ట్టి ఈ సినిమా క‌చ్చితంగా ఒక మంచి సినిమా అవుతుంది. ఇంత కాన్ఫిడెంట్‌గా ఈ మాట చెప్ప‌డానికి కార‌ణం నా సోద‌రుడిమీద ఉన్న న‌మ్మ‌కం అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ – ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డిగారికి, శివ నిర్వాణ గారికి థ్యాంక్యూ వెరీ మ‌చ్. శివ గారి అన్ని సినిమాలు నాకిష్టం. ఫ్యామిలీస్, యూత్‌ని చాలా బాగా చూపిస్తారు. ఈ రోజు అతిథి దేవోభ‌వ ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేశాం. చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పాట‌లు కూడా రికార్డ్ చేశాం. ఈ అవ‌కాశం ఇచ్చిన రాజాబాబు, అశోక్ రెడ్డి గారికి థ్యాంక్స్‌. రాజాబాబు గారు చాలా కేర్‌తీసుకుని ఈ సినిమా నిర్మించారు. శేఖ‌ర్ చంద్ర మంచి సాంగ్స్ ఇచ్చారు. భాస్క‌ర‌భ‌ట్ల గారి సాహిత్యం ఈ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. త‌ప్ప‌కుండా ఒక మంచి సినిమా అవుతుంది అన్నారు.

తారాగ‌ణం: ఆదిసాయికుమార్‌, నివేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి, సూర్య‌, ఆద‌ర్శ్‌, ర‌వి ప్ర‌కాశ్‌, ర‌ఘు కురుమంచు, బీహెచ్ఈఎల్ ప్ర‌సాద్‌, గుండు సుద‌ర్శ‌న్, ప్రియాంక‌, న‌వీనా రెడ్డి, స‌త్తిపండు, ఇమ్మాన్యేల్‌

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌ :- శ్రీనివాస సినీ క్రియేషన్స్
నిర్మాత‌లు :- రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
ద‌ర్శక‌త్వం :- పొలిమేర నాగేశ్వర్
సంగీతం :- శేకర్ చంద్ర
క‌థ‌ :- K. వేణు గోపాల్ రెడ్డి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ :- రజిని రాజాబాబు
డిఓపి:- అమర్ నాద్ బొమ్మిరెడ్డి
ఎడిట‌ర్‌ :- కార్తిక్ శ్రీనివాస్
కొరియోగ్రాఫ‌ర్ :- V.J. శేకర్, హానీ
లిరిసిస్ట్‌ :- భాస్కర భ‌ట్ల‌, కె. కె
ఆర్ట్ డైరెక్ట‌ర్ :- రఘు కులకర్తి
సింగ‌ర్స్‌ :- సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి, నూతన
ఫైట్ మాస్ట‌ర్ :- జాషువ
కో-డైరెక్ట‌ర్‌ :- శంకర్ మైచ‌ర్ల‌
ఎగ్జిక్యూటివ్‌ :- శామ్ బొల్లెప‌ల్లి
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌:- జోగినాయుడు మొల్లేటి
పీఆర్ఓ :- వంశీ-శేఖ‌ర్
డిజైన‌ర్‌ :- ధనియేలే

- Advertisement -