క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన సామ్…

525
Here's is what Samantha Akkineni has to say about casting couch
- Advertisement -

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ సాగిన వివాదం అంతా ఇంతా కాదు. ఈ నేపధ్యంలో నటి శ్రీరెడ్డి ఫిలీం ఛాంబర్ వద్ద అర్ధనగ్నప్రదర్శనతో సంచలనం సృష్టించింది. ఈ వివాదం రాను రాను వ్యక్తిగత దూషణలకు వేదికైంది. ఈ వ్యవహారంలో గతంలో కొందరు నటీ నటులు స్పందించిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంపై తాజాగా స్పందించింది నటీ సమంత.

క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పిరశ్రమకు మాత్రమే పరిమితంకాదని అన్ని రంగాల్లో ఇది విస్తరించింది ఆమె తెలిపింది. నాకు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వంటి అలాంటి అనుభవాలు ఎప్పుడ దరి చేరలేదని ఆమె అన్నారు. నా మొదటి చిత్రం విజయం సాధించటంతో నేను సినిమా అవకాశాల కోసం పెద్దగా తిరిగే అవకాశం రాలేదని ఈ సందర్భంగా తెలియజేశారు సమంతా.

 Here's is what Samantha Akkineni has to say about casting couch

ఏ సినిమా పరిశ్రమలోనైనా చేడుతో పాటు మంచి కూడా ఉంటుందని ఆమె అన్నారు. సమంత ప్రస్తుతం ఇటు తెలుగుతో పాటు తమిళంలో చేతినిండ సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తమిళంలో విశాల్‌తో నటించిన సినిమా విడుదలకు సిద్దమైంది. ఇటీవల విడులైన రంగస్థలం సినిమాతో మంచి నటిగా మరోసారి రుజువు చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ వసూళ్ల పరంగా రికార్డును నెలకోల్పింది.

- Advertisement -