క్యాస్టింగ్‌ కౌచ్‌పై సమంతా

223
Samantha blasts trolls
- Advertisement -

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై సినీ నటి సమంతా స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని అన్ని రంగాల్లో ఉందని తెలిపింది. అమ్మాయిల బలహీనతలను వాడుకునే నీచులు అన్నిచోట్ల ఉన్నారని చెప్పుకొచ్చింది. తాను నటించిన తొలి సినిమానే హిట్ కావడంతో, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం తనకు రాలేదని సమంత తెలిపింది.

సినీ పరిశ్రమలో చెడు విషయాలు మాత్రమే కాకుండా, మంచి విషయాలు కూడా ఉన్నాయని తెలిపింది. తనకు ఒక అందమైన జీవితాన్ని ఈ పరిశ్రమ ఇచ్చిందని… అందుకే పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటించాలని తాను అనుకుంటున్నానని చెప్పింది. గత ఎనిమిదేళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో తాను నటిస్తున్నప్పటికీ, తనకు అలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది.

రీల్ లైఫ్ జీవితాన్ని రియల్ లైఫ్‌లో ఆనందించేందుకు ఇండస్ట్రీకి చెందిన చైతూని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి వివాదం టాలీవుడ్ ను కుదిపేసింది. గత రెండు నెలలుగా ఈ స్థాయిలో రచ్చ అయిన వివాదంపై సినీ పరిశ్రమ స్పందించి కమిటీని కూడా వేసింది.

- Advertisement -