మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ గురించి పరిచయం అవసరం లేదు. నీలిచిత్రాల గురించి కాస్త తెలిసిన వారికి కూడా సన్నీలియోన్ గురించి పూర్తిగా తెలుసు! వయసులో ఉన్న అబ్బాయిలు మొదలుకొని సినీ ఇండస్ట్రీ వరకు అంతా అమ్మడు గురించి చర్చించుకుంటారు.
అంత పాపులర్ అయిన సన్నీలియోన్ తాజాగా ఓ కండోమ్ యాడ్ లో నటించింది. అయితే ఆ యాడ్ పై ఇప్పటికే దుమారం లేరింగి. కాగా…మరోమారు ఆ యాడ్ వివాదాస్పదంగా మారింది.
గోవాకు చెందిన ఒక నేత దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రకటనలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ యాడ్ అందరూ సిగ్గుపడేలా ఉందని అన్నారు. సన్నీలియోన్ ఆ ప్రముఖ కండోమ్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉన్నారు. ఈ యాడ్‌పై గతంలోనూ వివాదం చెలరేగింది. ఈ సారి ఫ్రాన్సిస్కో సిల్వేరియా అనే రాజకీయ నేత విమర్శలు గుప్పించారు.
ఆయన మాట్లాడుతూ గోవా ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సులలో ఈ యాడ్‌ను ప్రసారం చేస్తున్నారు. అలాగే ఈ యాడ్ పోస్టర్లను బస్సులపై అతికిస్తున్నారు. ఈ యాడ్ చూసిన గోవా ప్రజలు అవమానంగా భావిస్తున్నారు. పైగా ఈ బస్సుల్లో విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. ఇటువంటి ప్రకటనల వలన ప్రజలపై చెడు ప్రభావం పడుతుంది. సన్నీలియోన్ నటించిన ఈ యాడ్‌పై కార్పొరేషన్, సదరు యాడ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో ఈ యాడ్ ప్రచారంపై రిపబ్లికన్ పార్టీ మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. ఇటువంటి ప్రకటనలు మహిళలను కించపరిచేవిగా ఉన్నాయని వారు ఆరోపించారు.