‘హలో’ ట్రైలర్ చూడండి..!

485
- Advertisement -

యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘హలో’ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఈ రోజు విడ‌ద‌లైంది. మనం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్‌ మొద‌లవుతోంది. ‘హలో.. ఈ అబ్బాయ్ పేరు అవినాష్. ఒకప్పుడు ఈ ఇతడిని శ్రీను అని పిలిచేవారు’ అంటూ ఈ సినిమా క‌థ‌ను కొద్దిగా చెప్పేశారు నాగార్జున‌.

Hello-Theatrical-Trailer-1512132139-1909

ఈ సినిమాలో అఖిల్‌కు త‌ల్లిగా న‌టిస్తోన్న రమ్యకృష్ణ ’15 ఏళ్లుగా ఒక అమ్మాయ్ కోసం ఎదురుచూస్తున్న నీకు పిచ్చిరా, మరిచిపోవాలిరా’ అని డైలాగ్ కొట్టారు. ఈ సినిమాలోని డైలాగులు చాలా సింపుల్‌గా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. జగపతిబాబు అఖిల్‌కి తండ్రిగా న‌టిస్తున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 22న విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -