తన అందం రహస్యం చెప్పిన మిల్కీ బ్యూటీ

421
- Advertisement -

సినీ రంగంలో ఎంత మంది హీరోయిన్లు వచ్చినా.. ఎవరికి వారే సాటి. అయితే మిగతా హీరోయిన్ల కన్నా మిల్కీ బ్యూటీ తమన్నా అందమే వేరు. ఇతర కథాయికలతో పోలిస్తే తమన్నా కాస్త భిన్నంగానే ఉంటుంది. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ తో పేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చేసింది. బాహుబలి తమన్నాకు మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. అయితే ఆమె అందం రహస్యంపై ఎంతోమంది ఆమెను అడుగగా.. సున్నితంగా నత్తింగ్ అని చెప్పి వెళ్లిపోయేది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీలో తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అందం గురించి చెప్తూ సినిమా గ్లామర్ ప్రపంచంగా వెల్లడింది.

సినీ రంగంలో అందంతో పాటు ప్రతిభ కూడా ముఖ్యమని.. అది ఉంటేనే నిలబడగలమని చెప్తోంది ఈ మిల్కీబ్యూటీ. ఇక తన అందం సీకెట్ర్ ను చెప్తూ.. ఇప్పటికీ తన తల్లి ఆలోచనలనే అమలు చేసుకుంటూ అందాన్ని కాపాడుకుంటానని తెలిపింది. ఇళ్లలో ఉండే సాధారణ అమ్మాయి బ్యూటీకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తానూ కూడా అంతేనని చెప్పింది. అందం విషయంలో పాత పద్దతులను పాటిస్తానని.. షూటింగ్ అయి.. ప్యాకప్ చెప్పగానే మేకప్ తీసేస్తానని తెలిపింది.

మొత్తం మీద తన అందానికి రహస్యం చిట్కాలేనని తమన్నా చెప్తోంది. బాహుబలికి ముందు తమన్నా ఎన్నో కమర్షియల్ చిత్రాలు చేసినప్పటికీ.. బాహుబలి సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇక తమిళంలో ప్రభుదేవాతో దేవీ-2 చిత్రంలో మరోసారి రోమాన్స్ చేస్తోంది. సినిమాలకు తగ్గట్టుగా తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల మనసు దోచుకుంటోంది ఈ మీల్కీబ్యూటీ.

- Advertisement -