హీరామండి…ఫస్ట్‌ లుక్ పోస్టర్‌

78
- Advertisement -

గతేడాది గంగూభాయి కతియావాడి అనే సినిమా ద్వారా బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. వేశ్య వృత్తిలో దిగిన గంగూ..ఏవిధంగా గంగూభాయిగా ఎదిగిందో అద్భుతంగా చూపించిన సంజయ్ లీలా భన్సాలీ. తాజాగా అదే కథా ఇతివృత్తంతో తెరకెక్కిస్తోన్న వెబ్‌సిరీస్ హీరామండి. ఇది స్వాతంత్య్రానికి ముందు హీరామండి ప్రాంతంలోని వేశ్యల కథను తెరకెక్కిస్తున్నారు.

హీరామండిలోని సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్‌ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. తాజాగా హీరామండి వెబ్‌సిరీస్‌ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. పోస్టర్‌లో మనిషా కొయిరాల, అతిధిరావు హైదరి, రీచా చద్ధా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌, సోనాక్షి సిన్హాలు క్వీన్స్‌ గెటప్‌లలో రాయల్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్‌సిరీస్ ఈ యేడాది మధ్యభాగంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి…

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

మైఖేల్ ఓటీటీలోకి ఎప్పుడంటే…

ఓ తండ్రిగా గర్వపడుతున్నా..

- Advertisement -