ఓ తండ్రిగా గర్వపడుతున్నా..

16
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు పరిశ్రమని ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేశారు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్ అవార్డు వచ్చింది. అయితే తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ నటన గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…చరణ్‌ పాత్ర ఎంతో నచ్చిందని అన్నారు. ఈ పాత్రను అర్థం చేసుకోవడానికి టైమ్ పట్టిందని అన్నారు. కానీ ఒక్కసారి అర్థమయ్యాక మనసు బరువెక్కుతుందని చెప్పారు. చరణ్‌ పాత్రను రాజమౌళి గొప్పగా మలిచారని, ఇదే విషయాన్ని తనతో స్యయంగా కలిసినప్పుడు చెప్పానని గుర్తు చేసుకున్నారు.

జేమ్స్ కామెరూన్ మాటలపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. గ్లోబల్ ఐకాన్ సినిమాటిక్, జీనియస్ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆస్కార్‌ కంటే తక్కువేం కాదని చిరు తన సోషల్‌ మీడియాలో వెల్లడించారు. చరణ్‌ సినీ ప్రయాణంపై తండ్రిగా నేను గర్వపడుతున్నాని అన్నారు. మీ అభినందన చరణ్ భవిష్యత్‌కు ఆశీర్వాదం కావాలని చిరు ట్వీటర్ ద్వారా రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి…

ప్రాజెక్ట్-కే క్రేజీ అప్‌డేట్…

NTR30 ఇంకా ఆలస్యం ?

మోక్షజ్ఞ ఎంట్రీకి ముందస్తు ప్లాన్ ?

- Advertisement -