కుమారి 21ఎఫ్‌కి 24 ముద్దులు

264
Hebah Patel new love story
- Advertisement -

కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, నటన, యాటిట్యూడ్‌తో యూత్ మెచ్చిన హీరోయిన్ గా మారి పోయింది హెబ్బా పటేల్. తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలో వరుస వియాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత హెబ్బాకు ఆశించిన మేర విజయాలు దక్కలేదు. గతేడాది హెబ్బా పటేల్ నటించిన ‘ఏంజెల్’ సినిమా కూడా ఆమెను నిరాశకు గురిచేసింది.

తాజాగా  మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకువస్తోంది. శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్ అనే చిత్రంలో హెబ్బా హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మిణుగురులు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అయోధ్యకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్న నటుడు తేజ సజ్జ హీరోగా పరిచయం కానున్నాడు. ముఖ్యంగా మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఇంద్ర, చూడాలని ఉంది లాంటి సినిమాలు తేజకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

కుమారి 21 ఎఫ్‌లో నా పాత్రకు ఎంత పేరొచ్చిందో, ఇందులోనూ అంతే పేరొస్తుంది అని నమ్ముతోంది ఈ బ్యూటీ. ఈ సినిమాతో హెబ్బా  నాటి రోజుల్ని మళ్లీ వెనక్కి తెచ్చుకుంటుందేమో చూడాలి.

- Advertisement -