ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 ప్రతి రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది! కోట్లాది మంది భక్తులు ఈ మహా సమ్మేళనాన్ని సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ రికార్డు కూడా కుంభమేళా పేరిట నమోదు అయ్యింది. మహా కుంభమేళాకు దారితీసే రహదారుల్లో 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని సమాచారం వచ్చింది.
కుంభమేళాకు వెళ్లే రహదారుల్లో వాహనాలు కిటకిటలాడుతున్నాయి. ఎటుచూసినా వాహనాలు, వాటిల్లో భక్తుల పడిగాపులే కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనానికి హాజరు కావడానికి ఆసక్తి చూపుతున్న లక్షలాది మంది యాత్రికులు ఆదివారం కుంభమేళా ప్రాంగణానికి వందల కిలోమీటర్ల దూరంలో తమ కార్లలో చిక్కుకుపోయారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
మధ్యప్రదేశ్ మీదుగా మహా కుంభమేళాకు వెళ్లే యాత్రికుల వాహనాలతో 200-300 కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ విస్తరించిందని, దీంతో అక్కడి పోలీసులు ఆదివారం వివిధ జిల్లాల్లో ట్రాఫిక్ ను నియంత్రించలేకపోవడంతో ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారని తెలుస్తోంది.
అయితే రద్దీ కారణంగా మధ్యప్రదేశ్ లోని చాలా రూట్స్ లో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని, సొంతంగా షెల్టర్లు చూసుకోవాలని చెప్పడం గమనార్హం.
కట్నీ జిల్లాలో పోలీసు వాహనాలు సోమవారం వరకు ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా.. మైహర్ పోలీసులు కట్ని, జబల్ పూర్ వైపు వాహనాలను తిరిగి వచ్చి అక్కడే ఉండాలని కోరారు. 200-300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉన్నందున ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లడం అసాధ్యమని పోలీసులు తెలిపారు.
Also Read:TTD: తిరుమల కల్తీ నెయ్యి ..నలుగురు అరెస్ట్
మధ్యప్రదేశ్ లోని కట్నీ, జబల్ పూర్, మైహార్, రేవా జిల్లాల్లో రోడ్లపై వేలాది కార్లు, ట్రక్కులు భారీ క్యూలైన్లలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలు వీడియోలు చూపిస్తున్నాయి. రేవా జిల్లాలోని చక్ ఘాట్ వద్ద కట్నీ నుంచి ఎంపీ-యూపీ సరిహద్దుల వరకు 250 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రద్దీపై ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. “జబల్ పూర్ కి ముందు 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్.. ప్రయాగ్ రాజ్ కు ఇంకా 400 కి.మీ. మహా కుంభమేళా కు వచ్చే ముందు ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకోండి,”

