తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ..

34
karthika masam

తెలుగు రాష్ట్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో ఉన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తితో పాటు వేములవాడ రాజరాజేశ్వస్వామి ఆలయాలు భక్తులు తరలివచ్చారు. అలాగే పంచారామక్షేత్రాలు భక్తులతో సందడిగా కనిపించాయి.

కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు భక్తులు. ధర్మపురిలో సోమవారం నుంచి నిత్యం సాయంత్రం గోదావరి నదీహారతి కార్యక్రమం కనుల పండువగా జరుగనుంది. మొత్తంగా శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగిపోతున్నాయి.