ఈ ఓటింగ్ విధానం దేశానికే ఆదర్శం..

159
- Advertisement -

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో పాటు ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి. ఈ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు.. జీహెచ్ఎంసీ అధికారులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాత టెక్నాలజీ వినియోగిస్తాం. పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు టి పోల్ (TE poll) అవగాహణ కార్యక్రమం చేపడుతామన్నారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని..ఓటర్ లిస్ట్.. పోలింగ్ కేంద్రంను ఆన్ లైన్‌లో పొందుపరుస్తామన్నారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తాం. టీ పోల్ ధ్వారా పోటీ చేసే స్వాతంత్ర్య అభ్యర్థులు.. పార్టీ అభ్యర్దుల వివరాలు తెలుసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల తక్కువ సమయంలో… తక్కువ సిబ్బందితో ఎన్నికల ను నిర్వహించ వచ్చు ఈసీ తెలిపారు.

త్వరలోనే జీహెచ్ఎంసీ జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేస్తాం. 150 పోలింగ్ కేంద్రంలో వార్డు ఒక్క ఫేస్ రికగ్నేషన్ యాప్‌ను వాడుతాం. ఈ ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో ఓటరు పూర్తి వివరాలు తెలుస్తాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీనియర్ సిటిజన్.. దివ్యాంగులకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఓటింగ్(E-voting)విధానం అమలు చేయబోతోంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఓటింగ్ (E-voting) విధానం అమలు చేసేలా ఐటీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాం. ఈ ఓటింగ్ (E voting) విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. టీ పోల్ సాఫ్ట్ వేర్‌తో పాటు సాంకేతిక అంశాలపై వచ్చే నెల 23 నుంచి 29 వరకు జోన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం కమిషనర్‌ పేర్కొన్నారు.

- Advertisement -