రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు..

272
heavy rains
- Advertisement -

పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈరోజు(సెప్టెంబరు 15 వ తేదీన) ఉదయం అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

ఈ అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ గుజరాత్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు 1.5 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ తెలంగాణ, మరత్వాడా, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. తూర్పు-పశ్చిమ shear zone Lat.15.0 deg.N వెంబడి 3.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఏర్పడింది.

దీంతో తెలంగాణలో రాగల మూడురోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కోమురంభీం –ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ –పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ మరియు ఖమ్మం జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -