తెలంగాణలో భారీ వర్షాలు..

224
rains
- Advertisement -

పశ్చిమ విదర్భ ప్రాంతాలలో కొనసాగుతున్న వాయుగుండము ఈశాన్య దిశగా ప్రయాణించి ఈరోజు (జూన్ 4 వ తేదీన) ఉదయం 08.30 గంటలకు విదర్భ యొక్క వాయువ్య ప్రాంతాలు మరియు దానిని ఆనుకొని ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతాలలో Lat.21.2 deg N మరియు Long. 76.9 deg.E వద్ద అకోలా (మహారాష్ట్ర) కు వాయువ్య దిశగా 60 km,నాగపూర్(మహారాష్ట్ర ) కు పశ్చిమ వాయువ్య దిశగా 220 km, భోపాల్ (మధ్యప్రదేశ్ ) కు దక్షిణ ఆగ్నేయ దిశగా 230 km దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి బలహీనపడి ఈరోజు (జూన్ 4 వ తేదీ) సాయంత్రం సమయంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ మరియు మహే లోని మొత్తం ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్ ప్రాంతం మరియు నైఋతి బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం లోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి మరియు రాగల 2 నుండి 3 రోజులలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, నైఋతి మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం లోని మరి కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం లోని మొత్తం ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతాలలో సుమారుగా జూన్ 8వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -