తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 9 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. నిన్న పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి.
ఇక మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని దిగువకు విడుదల చేయగా 14 గేట్లు ఐదు అడుగులు, 12 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,82,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
ఇన్ ఫ్లో: 3,25,376 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 3,35,376 క్యూసెక్కులు ఉండగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 587.10అడుగులుగా ఉండగా జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Also Read:అమల్లోకి జీఎస్టీ కొత్త ధరలు..ఈ వస్తువుల ధరల తగ్గింపు!

