- Advertisement -
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎల్లారెడ్డిలోని కళ్యాణి వాగు ఉగ్రరూపం దాల్చడంతో.. వాగులో 10 మంది చిక్కుకున్నారు.
వాటర్ ట్యాంకర్ పైకెక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు మంజీర నది ఉప్పొంగి కుర్తి వద్ద హైలెవెల్ బ్రిడ్జిని తాకుతోంది. లింగంపేట మండలం ఆగపల్లి చెరువు కట్ట తెగిపోయింది. చెరువుకు గండి పడటంతో మెదక్(D) ధూప్సింగ్ తండా నీటమునిగింది
భారీ వర్షానికి తెగిపోయింది కామారెడ్డి – ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు. ఎల్లారెడ్డిలో 15 గంటలుగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోవడంతో లింగంపేట్ – ఎల్లారెడ్డి -కామారెడ్డి మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read:షుగర్ పేషెంట్ల కోసమే!
- Advertisement -

