- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును తెలిపింది వాతావరణ శాఖ.ఒరిస్సా నుండి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది.ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- Advertisement -