కార్తికేయ ఆర్‌ఎక్స్‌ 100కి రెండేళ్లు..!

200
karthikeya
- Advertisement -

కథలో కొత్తదనం ఉంటే.. చిన్న సినిమా అయినా భారీ కలెక్షన్స్ రాబడతాయని ఆర్ఎక్స్ 100 మూవీ నిరూపించింది. రియల్ లైఫ్ కథకి.. కొద్దిగా సినిమా హంగులు జోడించి దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన సినిమా విడుదలై సరిగ్గా నేటికి రెండేళ్లు.

యాక్ష‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్, రావు రమేష్, సింధూర పువ్వ రామ్ తదితరులు నటించారు. నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.

ప్రేమ కోసం పరితపించే పాత్రలో కార్తికేయ అదరగొట్టాడు. తొలి సినిమా అయినా తన నటనతో యూత్‌ని ఫిదా చేశాడు. ఇక కామంతో రగిలిపోతున్న గొప్పింటి అమ్మాయి పాత్రలో పాయల్ అదరగొట్టింది. ఈ మూవీ తర్వాత కార్తికేయ,పాయల్‌కు వరుస సినిమా అవకాశాలు దక్కాయి.

ఆర్‌ఎక్స్ 100 పూర్తయి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు కార్తికేయ. జూలై 12 నా జీవితంలో ఏ సమయంలోనైనా చూసినప్పుడు నాకు అద్భుతాలపై నమ్మకం, కలలపై విశ్వాసం, జీవితంలో ఆశ క‌లుగుతుందని…. నా పున‌ర్జ‌న్మ‌కి కారణమైన తండ్రి అజ‌య్ భూప‌తికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు కార్తికేయ.

- Advertisement -