కంటైన్మెంట్‌ జోన్‌లో అమితాబ్ నివసించే ప్రాంతం!

50
amitabh

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కుటుంబసభ్యులకు కరోనా టెస్టులు నిర్వహించగా వారికి నెగటివ్ రిపోర్టువచ్చింది.

అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమితాబ్ నివసించే జల్సా ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. అంతేగాదు వారుండే భవనం పరిసర ప్రాంతాల్లో శానిటైజ్ చేసి బిల్డింగ్‌ ప్రాంతాలను సీజ్ చేసి కంటైన్మెంట్ జోన్ నోటీసు అంటించారు.

కరోనాతో అమితాబ్,అభిషేక్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక గత పదిరోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు బిగ్ బి.