మళ్లీ భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరిక

130
rains
- Advertisement -

భారీ వర్షాలతో తెలంగాణ నిండుకుండలా మారింది. 33 జిల్లాల్లో భారీ వర్షాలు కురియగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిన సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు రెండు,మూడు రోజులుగా కాస్త రిలీఫ్ దొరకగా తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది.

రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.

ఏపీలో మళ్లీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉండటంతో సముద్ర తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.

- Advertisement -