బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 5 హైలైట్స్

89
episode 5

బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగు సీజన్ 5 ఎపిసోడ్‌ 5 పూర్తి చేసుకుంది. 5వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య రచ్చతో ఎపిసోడ్ అలా ముగిసిపోయింది. ఇక కాజల్‌తో ఇంటి సభ్యులు ప్రియ, శ్రీరామ్ చంద్ర వాదనకు దిగారు. తాను ఇప్పటివరకు కిచెన్ మొహమే చూడలేదని కాజల్ అనడంతో శ్రీరామచంద్ర, ప్రియా కౌంటర్ ఇస్తారు.

తర్వాత ప్రియాంక…. మానస్ దగ్గరకు వెళ్లి.. నాకిచ్చిన ఈ ఫ్లవర్‌ని నీకిస్తున్నా.. నువ్వు కెఫ్టెన్ అయ్యాక నాకు ఇవ్వు.. లేదు అంటే నేను కెఫ్టెన్ అవ్వడానికి ట్రై చేసేప్పుడు నాకు ఇది ఇవ్వు అని చెప్పగా దానికి మానస్ ఓకే అంటాడు. తర్వాత ఉదయాన్నే డాన్స్‌తో ఇరగదీశారు కంటెస్టెంట్స్‌. తర్వాత సన్నీ, జెస్సీ మాట్లాడుకుంటూ.. నాగార్జునా సార్ వచ్చినప్పుడు ఏం అంటారు అని.. ఆనీ మాస్టర్‌తో అయిన గొడవ గురించి భయపడుతున్నా అని చెబుతాడు. ఇక వినాయకచవితి కావడంతో ఇంటి సభ్యులకు పూజ చేసుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్.

రవి తన కూతుర్ని తలుచుకుని కాస్త ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, లోబో కూడా ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అని కన్నీళ్లు పెట్టుకుంటారు.ఇక సిరి, షణ్ముక్, కాజల్ మాట్లాడుకుంటూ.. గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయి అని మాట్లాడుకుంటారు. తర్వాత గుండలోని రుచుల జాడవేరు అనే పేరుతో బిగ్ బాస్ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా యాక్టివిటీ ఏరియాలో.. కొన్ని కుండలు వేలాడుతూ ఉన్నాయి.. ప్రతి కుండలో ఒక లగ్జరీ బడ్జెట్ ఐటమ్.. మరియు దాని పాయింట్స్ రాసి ఉంది.. లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ పొదడానికి.. ఆ కుండల్ని కర్రలతో పగలగొట్టాల్సి ఉంటుంది. మీరు పగలగొట్టిన కుండకు లగ్జరీ బడ్జెట్ ఐటమ్ లభిస్తుంది.. ఇలా కేవలం పది కుండల్ని పగలగొట్టే అవకాశం.. మీకుంది. ఇందులో కేవలం ఇద్దరూ మాత్రమే పాల్గొనాలి.. ఇద్దరిలో ఒకరు మరొకరి భుజంపై కూర్చోని.. కళ్లకు గంతలు కట్టుకోవాలి. మిగిలిన వారంతా ఆ వ్యక్తిని గైడ్ చేసి కుండలు కొట్టేలా చెయ్యాలి అచి చెప్పగా ఇంటి సభ్యులంతా విశ్వ, శ్రీరామచంద్రలను ఎంచుకుంటారు.

తర్వాత బెస్ట్ పర్ఫార్మర్‌-వేస్ట్ పర్ఫార్మర్‌లని సెలెక్ట్ చెయ్యమని బిగ్ బాస్ చెప్పగా రవి..బెస్ట్ పర్ఫార్మర్‌‌గా లోబోని, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా జెస్సీని సెలెక్ట్ చేశాడు. తర్వాత లోబో.. బెస్ట్ పర్ఫార్మర్‌‌గా ఆని మాస్టర్‌ని, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా జెస్సీ ఎంపిక చేశాడు. ఇక జెస్సీ.. బెస్ట్ పర్ఫార్మర్‌‌గా సిరి, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా రవిని చెబుతాడు. మొత్తానికీ అంతా కలిసి ఎక్కువ శాతం జెస్సీని వరస్ట్ పర్ఫార్మర్‌‌గా ఎంపిక చేశారు. ఇక బెస్ట్ విశ్వగా నిలిచాడు. ఈ క్రమంలో ప్రియాంక- ఉమాదేవి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది