రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు..

579
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. మళ్లీ గత రెండు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వానలు మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అటు ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలతో.. క్షణాల్లో కారుమబ్బులు కమ్ముకొని కుండపోత వర్షం కురుస్తోంది.

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఏళ్లుగా అరకొరగానే నిండే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా ఈ సారి నిండుకుండను తలపిస్తోంది. అటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లు మళ్లీ మళ్లీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. బాసర నుంచి మొదలుకొని భద్రాచలం వరకు.. అటు ఏపీలోనూ గోదావరి నది కళకళలాడుతోంది.

- Advertisement -