నేడు హుజూర్‌నగర్‌లో కేటీఆర్ రోడ్ షో..

579
ktr
- Advertisement -

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోరు మీదుంది. ప్రచారంలో కారు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎక్కడికెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండలంలో గులాబీ సైనికులు కదం తొక్కారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.

ktr

ఉప ఎన్నికల ప్రచారపర్వంలో టీఆర్ఎస్ రోడ్ షోలకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు హుజూర్ నగర్ టౌన్‌లో ఎన్నికల ప్రచారంలో భంగంగా టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్‌ రోడ్ షో లో పాల్గొననున్నారు. ఈ రోడ్‌ హుజూర్ నగర్ షో టౌన్ లోని లింగగిరి రోడ్ నుంచి ఇందిరా చౌరస్తా వరకు నిర్వహించనున్నారు.పార్టీ నాయకులు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -