రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..

79
rains

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురియగా రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది.. ఇక‌, వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ల‌తో రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.. జిల్లా యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తంగా ఉంచాల‌ని ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 12,13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. వ‌ర్షాలు ఎడ‌తెరిసి లేకుండా కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది వాతావ‌ర‌ణ‌శాఖ‌. అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్లడించింది వాతావరణ శాఖ.