రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది.ఇక తెలంగాణను ఆనుకొని అల్పపీడన ద్రోణి ఏర్పడగా ద్రోణి ప్రభావంతో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాగులు,వంకలు పొంగి పొర్లుతుండటంతో జాగ్రత్త చర్యలు ఏర్పాటుచేయాలని సూచించారు.
హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన వాన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హయత్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్‌సాగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలానగర్, దుండిగల్, కొంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్‌లో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతునే ఉన్నాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 18.3 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 17.9 సెం.మీ., రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 15.5 సెం.మీ,సిద్దిపేట జిల్లా వర్గల్‌లో 13.4 సెం.మీ, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 13.3 సెం.మీ.వర్షపాతం నమోదయ్యింది.