వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అదిరింది!

186
swathi dikshith

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4లో భాగంగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సర్‌ ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్‌. బిగ్ బాస్ చరిత్రలో మూడోవారంలోనే మూడో కంటెస్టెంట్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండో వారంలో కుమార్ సాయి పంపన, ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా తాజాగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఫేస్‌కి మాస్క్ పెట్టుకుని వచ్చి సర్ ప్రైజ్ చేసిన దీక్షిత్‌ను ఇంట్లో ఉన్న పురుషులు ఇంప్రెస్ చేయాలని కోరారు బిగ్ బాస్. దీంతో అభి, అఖిల్‌, నోయల్ లు పాటలతో మిగిలిన వాళ్లు తమకు తోచిన విధంగా సర్ ప్రైజ్ చేయడానికి తెగ ప్రయత్నించారు.

అఖిల్, అవినాష్, రాజశేఖర్ మాస్టర్, నోయల్‌లకు ఇంప్రెస్ అయినట్టు చెప్పిన స్వాతి.. వాళ్లకి రెడ్ రోజ్‌లు అందించి మరింత జోష్ తెచ్చింది. ఇక హౌస్‌లో పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్ ఈసారి మొనాల్‌ని పక్కన పెట్టి స్వాతితో పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు హౌస్‌లో ఏం జరిగిందో తెలపగా అభిజిత్ గురించి ఇంటి సభ్యులు అవినాష్, గంగవ్వ, లాస్య, నోయల్‌, రాజశేఖర్ మాస్టర్‌, సుజాతలు తెగ నవ్వుకుని గుసగుసలాడారు. మొత్తంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి హౌస్‌లో ఏ మేరకు అలరిస్తుందో వేచిచూడాలి.