ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. నాలాలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాపాతం నమోదుకావడంతో పలు కాలనీలకు కాలనీలే నీట మునిగాయి. టోలిచౌకి,పాతబస్తీతో పాటు పలు ఏరియాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి.
మరో రెండు రోజులు కూడా ఈ తరహాలోనే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలు వెంటనే ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు.వర్షాలు విఫరీతంగా పడుతున్నందున అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు కమిషనర్.