రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
హయత్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్‌సాగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలానగర్, దుండిగల్, కొంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, గండిపేట్, శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 18.3 సెం.మీ, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 17.9 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 15.5 సెం.మీ., రంగారెడ్డిలోని కోతూర్‌లో 14.3 సెం.మీ., ఫరూక్‌నగర్‌లో 14.3 సెం.మీ., వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 13.8 సెం.మీ వర్షాపాతం నమోదైంది.