దేశరాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు..

34
- Advertisement -

భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయింది. ఎడతెరపిలేని వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దాదాపు పదేళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం పడిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

పగలు, రాత్రి నిర్విరామంగా వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2013 జులై 21న అత్యధికంగా 124.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడం సహా వరద ముప్పుపై హెచ్చరికలు జారీ చేసింది.

Also Read:‘జైలర్’ సాంగ్..మంచి రెస్పాన్స్

- Advertisement -