నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

440
- Advertisement -

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు తాజా పరిస్థితులపై ఓ ప్రకటన విడుదల చేశారు.

rains

మధ్య ఒడిషా ప్రాంతంలో ఉరితల ఆవర్తనం కొనసాగుతుందని, అలాగే దక్షిణ ఛత్తీస్‌గడ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కి.మీ ల ఎత్తులో మరో ఉపరిత ధ్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీనికారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు.

- Advertisement -