తెలంగాణలో భారీ వర్షాలు..

160
Heavy rainfall
- Advertisement -

పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు(సెప్టెంబరు 14 వ తేదీన) ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. తూర్పు విదర్భ మరియు దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్ గఢ్ ప్రాంతాలలో 0.9 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతారణశాఖ అధికారులు వెల్లడించారు.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి మరియు నాగర్ కర్నూల్ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్, కోమురంభీం –ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ –పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాలలో రేపు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -