దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

59
coronavirus

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,34,154 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 2,887 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,84,41,986కు చేరగా మొత్తం 2,63,90,584 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,13,413 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 3,37,989 మంది మృతిచెందారు.