నగరంలో భారీ వ‌ర్షం.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక..

29
- Advertisement -

హైద‌రాబాద్ మంగ‌ళ‌వారం రాత్రి భారీ వ‌ర్షాలు కురిసే సూచన ఉండడంతో న‌గ‌ర వాసుల‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ తాజా ఓ కీల‌క హెచ్చ‌రిక జారీ చేసింది. న‌గ‌రంలో మంగ‌ళ‌వారం రాత్రి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది. అవ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సూచించింది.

న‌గ‌రంలోని సికింద్రాబాద్‌, అల్వాల్‌, నేరెడ్ మెట్ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈరోజు మ‌ధ్యాహ్నం నుంచి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షం నేప‌థ్యంలో ఆయా ప్రాంతాలు ఇప్ప‌టికే జ‌ల‌మ‌య్యాయ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టాయి.

- Advertisement -