నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

428
- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వానలు పడతూనే ఉన్నాయి. ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మరఠ్వాడ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, అసోం, ఒడిశా, మేఘాలయ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

hyderabad rains

జార్ఖండ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడు, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని… మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు.

- Advertisement -